వెళ్లిపోవద్దే

మళ్లీ జన్మించే మాటే విన్నానే,
ప్రాణం పోతున్నా ప్రేమే చూశానే...
కంటి పాపల్లో రూపం నీదేలే,
వెండి వెన్నెల్లో వెలుగు నీవేలే...
ప్రేమ, పిచ్చోడల్లే వెతికా నిన్నే... దారుల్లోన
రాని, నిన్నే కోరి వెళుతున్నానే... చీకట్లోన
రహదారుల్లో వస్తున్నానే, ఏ దారి తోచని చలి వేళల్లో...

కంటపడవా కొంటేతనమా, కలుసుకోనంటూ పంతాలేనా..
పరుగులు తీస్తూ పిచ్చి మనసే, పడుతూ లేస్తూ పయనించేనా..
అర్థం, లేని కోపం చూపిస్తావే చెలియా... నాపై
అందం, అందని వర్ణం అనిపిస్తావే నువ్వే... ఆపై
మోసం కాదే, మనసుని తొలిచేస్తుంటే...
భాదే పోదే, నువు కనపడకుంటే...
రావా, ఉండిపోవా నా గుండెల్లో... చిన్ని పాపై
పోవా, ఒదిగిపోవా నా కౌగిలిలో... పిచ్చి ప్రేమై
రానంటావే, రాతి మనసా...
లావా, పొంగించేవా నా కన్నులో... నిప్పుల కొలిమై
కావా, కలిసిపోవా నా కన్నీళ్ళల్లో... తీయని గురుతై
వద్దంటావే, వెలిపోయావే...
నన్నే వదిలేసి, ఒంటరి చేసావే...
కంటి రెప్పల్లో, తడినే పెంచావే...

ప్రేమ, వద్దంటున్నా వెంటచ్చావే...
నేరం, నాదేనంటూ వదిలేశావే...
నువ్వు,నేనంటూ కలలే కన్నానే...
కాలం గడిచాక, తప్పే తెలిసేనే...
మరిచిపోలేనే, మరణం ఈ ప్రేమే...
నిలిచిపోతానే, నీకోసమే..
ఇష్టం, నీతో ఉంటే అంతే చాలే...
కష్టం, నువు లేకుంటే నాతో పాటే...
మళ్లీ జన్ముంటే, ప్రేమ నీతోనే...
ప్రాణం చివరంటూ, నీ తోడుంటానే...
కాలం, ఆపే వీలే లేని కలనే కన్నా...
ప్రాణం, పందెం వేసి తిరిగొస్తున్నా...
వెళ్లిపోవద్దే...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Post a Comment

Trending