నా గుండెకోత
మారలేను నా మాటలో, ఓడిపోయా నీ ఆటలో...
మనసులేని మనిషికే మంచి రోజులు అంటే ఎలా..?
రంగు రంగు రాళ్లతో పోల్చి చూస్తే ఇలా..
ముత్యమైనా మరుగులే మారిపోతే అలా..
కళ్ల ముందే కలలకే సంకెళ్లేస్తే ఎలా..
మరువలేని మనసునే మందలిస్తూ ఇలా..
తిరిగిరాని దారిలో వెళ్లిపోతూ అలా..
గుండెలోని ప్రతి జ్ఞాపకం, అందనంటూ నువ్వు దాగటం గుండెకోతే కదా..
నా కన్నీటి కడలికి నీ నవ్వులే అలలు చేరు తీరం,
నీ దరికి చేరిన ప్రేమనే మరిచిపొమ్మని తిరిగి పంపడం ఏమంత న్యాయం..??

" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment