నీ అందం
నువ్వందం నీ నవ్వందం,
నవ్వుల దాగెను మకరందం.
పలుకందం పసి అరవిందం,
పలుకుల నా చెలి పడుచందం.
నన్నే తలచిన క్షణమందం,
నువ్వే పిలిచిన పిలుపందం.
నాకై వెతికిన కనులందం,
నీకై బ్రతికిన జన్మందం.
అందం అందం ఇది నాకే సొంతం..
అందం అందం ఇది మన అనుబంధం..
ప్రేమను తలచిన తలపందం,
ప్రేమను గెలిచిన గెలుపందం.
కలమున కలిగిన కవితందం,
కవితలు తెలుపని సోగసందం.
అందం అందం ఇది నాకే సొంతం..
అందం అందం ఇది మన అనుబంధం..
నీ భాగ్యం తెలిపే చేతుల ఎరుపందం,
నా జతగా నడిచే
అడుగుల నలుపందం.
నేనై కోరిన నువ్వందం,
నువ్వై వలచిన నీనందం.
అందం అందం ఇది నాకే సొంతం..
అందం అందం ఇది మన అనుబంధం..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment