నా ప్రపంచం నువ్వే

నా ఆశల అర్థం నువ్వే,
నా శ్వాసల స్వార్థం నువ్వే,
నా ఆలోచనలకి మూలం నువ్వే,
నా ఆవేశాలకి ఆధారం నువ్వే,
నాది అనే పదానికి నిధిలా దొరికిన ప్రేమవు నువ్వే...
నీకు నేను లేని ప్రపంచం కావాలేమో,
కానీ, నా ప్రపంచం మాత్రం నువ్వే...

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending