నేననే నువ్వు...

నాది అని ఏది అనిపించినా నాకు కనిపించేది నువ్వే,
నాకు కాకుండా పోయేది ఏదైనా గుర్తు తెచ్చేది నిన్నే,
ఈ నేను అనే మాట నువ్వు లేకుండా పూర్తి కాదు,
నువ్వు లేని ఆలోచన ఏదైనా నాకు అర్థం కాదు.

గమ్యం చేరుకోవాలంటే గమనం ఉండాలని తెలుసు,
ప్రాణం నిలవాలంటే ఊపిరి తీసుకోవాలని తెలుసు.
కానీ, నిన్ను చేరుకోవాలంటే  మాత్రం ఏం చెయ్యాలో నాకు తెలియదు.
గుండెల్లో నిలిచిపోయేంతలా ప్రేమించడం నా నిర్ణయమే అయినా,
గుండె పగిలినా మర్చిపోలేకపోవడం నా బలహీనత.
కళ్ళ నిండా తడి ఉన్నా కనురెప్పల వెనుకే దాచి నవ్వుతున్నా,
మనిషి మాటకి తగిన తీరుని మార్చుకోగల మెలకువలు తెలిసున్నా,
నా మనసు తీరుని మార్చలేక మౌనంలో మిగిలున్నా ..

                           " ధన్యవాదాలు "
                      
                                   రచన
                           రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Post a Comment

Trending