నా జీవితం

మొదటి అడుగులు
చిన్ని చిన్ని పొరపాట్లు
అమ్మ చేతి తిట్లు
తిన్న గోరు ముద్దలు
లెక్కబెట్టిన చుక్కలు
కన్న కలలు
చదువులో లోటుపాట్లు
తీసిన గుంజిల్లు
మొక్కిన దేవుళ్ళు
దాచిన నిజాలు
చెప్పిన అబద్ధాలు
దొంగిలించిన డబ్బులు
తిన్న దెబ్బలు
ఆడుకున్న ఆటలు
చదువుకున్న వేళలు
అన్నీ గుర్తే...
వీటి అన్నిటి మధ్యలో ఎక్కడో నా ఆలోచనల అడుగున దాగివున్న
నా మొదటి ప్రేమ..!
రెప్ప పడని కళ్ళు
నిలబడని కాళ్ళు
పదమని ముందుకు తోసే అల్లరి వయసు
కాలం కరిగిపోతున్న విషయమే గుర్తు లేదు
జ్ఞాపకాలు
అనుభవాలు
కన్నీళ్ళు
కొత్త పోకడలు
అర్థం కాని విషయాలు
అర్థం చేసుకోలేని మనుషులు
చెప్పలేని మాటలు
దాచలేని కోపం
దూరమౌతుందనే భయం
దగ్గర అవ్వలేక భాధ
ఎన్నో నిద్ర పట్టని రాత్రులు
ఏవేవో అంతు చిక్కని ప్రశ్నలు
అన్నీ గుర్తే... అసలు మరిచిపోతేనే కదా..
దారి చూపిన స్నేహం
చీకటి దారిలో వెలుగై నన్ను నడిపించిన దైవం
కారణాలతో కాదని, మార్పుతోనే జీవితం మళ్లీ మొదలనే సత్యం
తెలిసిన క్షణం
నడిచిన ప్రతీ దారి ఒక పాఠం
కలిసిన ప్రతీ వ్యక్తి గురు రూపం
అనుగుణంగా లోకం
అనుభవంగా కాలం
నన్ను శిల నుండి శిల్పంగా మార్చాయి
ఒక్క మాటలో అర్థాన్ని వెతుక్కునే జ్ఞానం
ఒక్క మాటలో అర్థం చెప్పగల భావం
ఒక్క మాటకు మాత్రమే లొంగగలదని ఈ లోకం తెలుసుకున్నాను
మాటల కోటలనెన్నో నిర్మించుకున్నాను
కొన్ని సార్లు ఆ కోటలే గుడిలా మారి దేవుడికి దాసోహం అవగా
ఇంకొన్ని ప్రేమ రాజ్యానికి రాజధానిగా నిలిచిపోయాయి
ఏ మాట రాసిన నాదైన గుర్తింపు
ఏ చోటులోనైనా మాట జారని అన్వయింపు
ఎన్నో పాఠాలు
ఎన్నెన్నో అనుభవాలు
మానని గాయాలు
వెన్నుండి నడిపించిన వ్యక్తులు
అన్నిట్లో తొడున్న మిత్రులు
అన్నీ గుర్తే.. ఎప్పటికీ మర్చిపోలేను...
ఈ క్షణం కలో నిజమో తెలియదు
రేపు అనేది ఉందొ లేదో తెలియదు
ఒక వేళ ఉంటే నేను మాట్లాడే ప్రతి మాటలో ఈ ప్రపంచాన్ని శక్తివంతం చేయగలిగే భావాన్ని పలికించమని ప్రార్థిస్తున్నాను..

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending