ఇదిరా జీవితం
పిచ్చివాడిలా ఎదురుచూడకు
ఉపయోగం లేదని తెలిసి కూడా నిరీక్షించకు
అత్యాశ పెంచుకుని నిరాశలో మిగిలిపోకు
సమాధానం దొరకదని తెలిసినా వేల కొద్దీ ప్రశ్నలని వేసుకుంటూ ఉండిపోకు
కళ్ళు మూతలుపడి వాలిపోతున్నా కళ్ళ నిండా నింపుకున్న రూపం కోసం వెతుకులాడకు
తను రాదని నీకు తెలుసు
ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా ఒప్పుకోక తప్పదు
దారి ముగిసిపోతే మరొక దారి వెతుక్కోవాలి కానీ,
అదే దారి చివరిలో కూర్చుని ఎదురు చూడకూడదు.
నిన్ను నువ్వు నిందించుకోకు
నిన్ను చులకన చేసుకుని మాట్లాడుకోకు
లేచి నిలబడు
సరికొత్త దారి వెతుక్కుని మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టు
పరిగెత్తు
గత కాల గమనానికి సంభందించిన గుర్తులు వేధించక ముందే
రేపటి ఆశల ఊబిలో చిక్కుకుని విలపించక ముందే
పరుగు మొదలుపెట్టు
అలుపెరుగని బాటసారిలా
అడుగులు ముందుకు వేస్తూ
ఆశలను
అశ్రువులను
అణగారిన అసమానతలను
నిన్ను ప్రశ్నించిన ప్రతి మాటను
సమాధానం దొరకని ప్రతి ప్రశ్నను
వెంటాడు
వేటగాడిలాగా గురి చూసి కొట్టు
యోధుడిలా యుద్ధం చేయడానికి సిద్ధపడు
ఈ ప్రపంచపు పంథాలన్నీ మార్చివేయడానికి ప్రణాళికలు రచించు
నీ మాటలు రుచించని ఎవరినైనా అక్కడికక్కడే విస్మరించు
విలువ లేని చోట నిమిషమైన నిలబడకు
చెరుకో నువ్వు కలలు కన్న సుసంపన్నమైన లోకాన్ని
ప్రశ్నించడం మాని అనుకరించే సహచరులు
అనుమానించడం మాని అభిమానించే ఆప్తులు
అవరోధాల నుండి అనుబంధాలు
శత్రువుల నుండి స్నేహితులు
నిన్ను ప్రేమించేవారు
నీకు విలువనిచ్చే వారు నిన్ను చేరుకునే వరకూ శ్రమించు
సరికొత్త ప్రపంచాన్ని నిర్మించి
నిన్ను నిన్నుగా కోరుకునే వారి కోసం జీవించు
ఇదే జీవితం...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment