కళ్యాణం
కన్నీటితో కన్యను దానమిచ్చిన తండ్రి సంతోషం
కాలు తొక్కి తాళి కట్టిన వరుణి వైభోగం
మొదటి సూత్రం మెడలో వేసి మెట్టినింటికి పంపే తల్లి మమకారం
చుట్టూ బంధువులు, ఎడిపించే స్నేహితులు అల్లరి చేసే పిల్లలు
ఇన్ని చూస్తూ చెప్పలేని ఆనందంలో కంటతడి పెట్టుకుంటూ కొసరి కొసరి నవ్వే ఆడపిల్ల మనసులో నిలిచిపోయే క్షణం కళ్యాణం..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment