నాకు తెలియదు..

నేను నేర్చుకున్న చదువు ఎంత సంస్కారం నేర్పిందో తెలియదు
నేను ఎంచుకున్న దారి నన్ను ఏ వైపుకి నడిపిస్తుందో తెలియదు
నేను మలుచుకున్న స్వభావం ఎన్ని తప్పులు చేయిస్తుందో తెలియదు
నేను చేసిన తప్పులు ఇంకెన్ని పాఠాలు నేర్పిస్తాయో తెలియదు
నేను నేర్చుకున్న పాఠాలు నాలో ఎంతటి మార్పుని తీసుకొస్తాయో తెలియదు
నేను అనే అహంకారం నన్ను వదిలి ఎప్పుడు పోతుందో తెలియదు
నేను ఇవన్నీ తెలుసుకునే రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు
అది వచ్చిన రోజు నేను అనే ఈ నేను మిగిలి ఉంటానో లేదో తెలియదు
తెలియని దానిని తెలుసనే భ్రమలో బ్రతకడం తెలియదు
తప్పు చేసి అది అసలు తప్పే కాదని భుకాయించడం తెలియదు
నచ్చకపోయినా పర్వాలేదు అని సర్దుకోవడం తెలియదు
దొరకకపోతే నాది కాదని వదిలేయడం తెలియదు
ప్రేమ చూపించిన మనిషిని మర్చిపోవడం తెలియదు
మరిచిపోయిన గాయాల్ని గుర్తుచేసుకోవడం తెలియదు
ఇష్టంలేక పోయినా నవ్వుతూ నటించడం తెలియదు
నవ్వుతున్నా నాలోపల జరిగే అంతః మధనాన్ని ఆపడం తెలియదు
విషపూరితమైన పాము కూడా వైద్యానికి ఉపయోగపడినట్టు
ఇన్ని విషయాలు తెలియని నేను, తెలిసిన నాలుగు మాటలు
చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోవడం కూడా తెలియదు...


                                   " ధన్యవాదాలు "

                                          రచన
                                 రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending