అంకిత భావం
జీవితానికి అర్థం చెప్పలేని అందమైన పదాల కోసం
అర్థరాత్రులు నిద్రమానుకుని నేను చేసే అన్వేషణ కన్నా,
అర్ధమయ్యే అతి సాధారణమైన మాటలే అత్యుత్తమమని అనిపించింది..
నిన్ను ప్రార్థించేందుకు పద్యాలు, శ్లోకాలు, ప్రార్థనా గీతాలు ఇవేవీ రావు నాకు..
నీవిచ్చే మోక్షం కోసం దానాలు, యాగాలు, యజ్ఞాలు వేటిని చేయలేను నేను..
ఎందుకంటే నేను కేవలం కుళ్లు, కుతంత్రం, అసత్యం, ఆధర్మం, వంచన, మోసం, స్వార్థం, ఆనందాన్ని ఇవ్వలేని ప్రతి వస్తువు మీద అపారమైన ఆశ కలిగిన అతి సాధారణమైన మనిషిని...
నువ్వు ప్రాణం పోసిన అందమైన పూలతో మాల చేసి నీ మెడలో వేయలేను,
నువ్వు ఆధ్యం పోసిన అలరించే అన్నమయ్య కీర్తనలని ఆలపించలేను,
నిన్ను ఆనందింపచేసేలా అద్భుతమైన పనులేవి నేను చేయలేను,
నీవిచ్చిన ఈ సృష్టిలో నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏదీ లేదు,
ఒక్క నీ పట్ల నేను పెంచుకుంటున్న అంకితభావం తప్ప...
అందుకో స్వామి అందుకుని నన్ను ఆదరించు,
చేతకాక, ప్రతి నిమిషం భయపడుతూ బ్రతకలేక భారం నీపై వేసి
నీ పాదాల చెంతకు చేరిన నన్ను నీ అక్కున చేర్చుకోవయ్యా..
ధన్యోష్మి శంకరా.. ధన్యోష్మి...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment