నా నమ్మకం

క్షణ కాలం..
నిజమైతే బాగుంటుంది ఆనిపిస్తే అది కల,
కలైతే బాగుంటుంది ఆనిపిస్తే అది జీవితం.

నమ్మకం, అవసరాల కోసం అమ్ముడుపోయిన ప్రతీ సారి అబద్దాలకి అవకాశం పెరుగుతుంది. అబద్ధం చెప్పడం చాలా సులభం కానీ, అబద్ధాల వల్ల కలిగే సంతోషం క్షణికం. నిజాన్ని దాచడం మరింత కష్టం కానీ, నిజాన్ని దాచడం వల్ల కలిగే భాద మాత్రం శాశ్వతం.

జీవితం అందరికీ కలని నిజం చేసుకునే కాలాన్ని దగ్గర చేస్తుంది, మనం మోసం అనే ముసుగులో జీవితాన్ని దూరం చేసుకుంటున్నాం. నమ్మిన వారిని మోసం చేయడం, మోసం చేసే వారిని నమ్మడం మానవ సహజం అనే జాబితాలోకి చేరిపోయింది. 

చీకట్లో మేలుకొని, వెలుగులో కళ్ళుమూసుకునే మా ఈ జీవితాలకు విలువలు కలిగిన దారిని చూపించమని అలసిన హృదయంతో ఆర్తిస్తున్నాను. అన్నింటికీ నీవే దిక్కని ఈశ్వరా నీకే నమస్కరిస్తున్నాను.

" ధన్యవాదాలు "
                                                                                                                                  రచన
                                                                                                                          రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending