అమ్మా నాన్న అంటే నాకు కోపం

కష్టం విలువ, కన్నీటి విలువ తెలియనీయకుండా పెంచిన మా అమ్మా నాన్న అంటే నాకు కోపం..
కోరుకున్నవన్నీ కొనిపెట్టి, ఆడిగినవన్నీ చేసిపెట్టి, నచ్చినట్టు బ్రతకడం అలవాటు చేశారు...
అప్పుడు ఇది కదరా జీవితం అంటే అనుకున్నా.
కానీ, ఇప్పుడు కోరింది దొరక్కపోయినా, అడిగింది అందకపోయినా, నచ్చినట్టు జరగకపోయినా
అర్థం లేని కోపంతో అరిచినప్పుడు అర్థమవుతోంది అసలైన జీవితం అంటే ఏంటో..


" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments