ఆఖరి మజిలీ 2
xxxxx,
ఈ రోజు నీతో చాలా మాట్లాడాలని మొదలు పెట్టాను..
కానీ, ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
నిన్ను చూసిన మొదటి క్షణం నుండి అన్నీ నీ ఆలోచనలే..
అనువంత ఆలోచనలైనా, అనుక్షణం నిన్ను గుర్తుచేస్తున్నాయి.
అన్నీ కలిపి నాలుగైదు నిమిషాలే ఐనా నన్ను వదిలిపోనన్నాయి.
ఆశలకి, ఆలోచనలకి అసలేం తెలుసు
అమూల్యమైన నీ ప్రేమ కోసం నేను పడే తపనేంటో
నిరంతరం నిన్ను తలుచుకునే నా మనసుకు తెలుసు
నువ్వు లేని లోటేమిటో, నా ప్రేమ లోతేమిటో..
కలలకి నీ రూపం తెలుసు
ఊహలకి నువ్వు రావడం తెలుసు
ఆశలకి నిన్ను నింపుకోవడం తెలుసు
కానీ, నా మనసుకు నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు.
ఇట్లు
- నీ ఆఖరి మజిలీ
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment