నిను చూశాక

నీ కళ్ళకి నల్లని కాటుక...
నా చూపుల తొందర ఆగక...
నీ పెదవుల ఎరుపే ఘాటుగా...
నా మదిలో మాటలు మౌనంగా...
నీ శ్వాసలో వీచే గాలికి తోడుగా...
నా ఊహలు ఉరకలు వేయగా...

ఆ క్షణం, రెప్ప వేయడం మరిచిన కళ్ళతో
నిన్ను చూస్తున్న ఆనందాన్ని...
అడుగులు ముందుకు పడని ఆలోచనలతో
నీపైన పెంచుకున్న ప్రేమని...
నా అలసిన మనసుని ఆకాశపు అంచుల్లో ఉంచి
నేలపై నడిచే నా దేవత కోసం...
అలుపెరుగని ఆశని అలవాటుగా పెంచి

నిరీక్షణగా నీకోసమే బ్రతుకుతున్నాను...

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments