నా మౌనం

మౌనం,
మనసులు కదిలేలా మాట్లాడించగలదు,
మనిషికి కదలికే లేకుండా నిలిపేయగలదు,
మాటలకు అందని భావాన్ని చెప్పగలదు,
కన్నులు చూడని అందాలను చూపగలదు,
అరిస్తే అర్థం కాకపోవచ్చు కానీ,
అర్థం కాని అరుపుల మధ్యలో కూడా అధ్బుతంగా వినిపించగలదు.


అలాంటి మాటలు రాని మౌనాన్ని,
ఆలా మాటల్లో చెప్పలేని అందాన్ని,
అన్నింటినీ మించిన అదుభుతమైన భావాన్ని,
నా కళ్ళలో నింపుకుని, మనసుతో విన్నాను...

ఆశ్చర్యం ఏంటంటే, అందనంత వరకూ ఆకలి తీర్చే పండులా కనిపించి
అందగానే, అపురూపంగా అనిపించింది.

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending