నీతోడై ఉండాలంటే

అడుగులకు మళ్ళీ కొత్తగా పాఠం నేర్పించాలి, ఏడడుగులు నీతో నడవాలంటే.
పెదవులకి తీయని మాటలు నేర్పించాలి, నాతిచరామి అని మాటివ్వాలంటే.
కళ్ళకి తోడుగా కల్మషం లేని మనసుని జతచేయాలి, జన్మంతా నీకు తోడుగా ఉండాలంటే.
క్షణమైనా విడువని చెయ్యంధించాలి, చివరికి చితిలోనూ తోడై రావాలంటే.

ఇన్ని చేసినా ఇంకా ఏదో అందించాలని నాకు అనిపించాలి, అన్నిట్లో నువ్వే గుర్తుండాలంటే.

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending