శివం

నాన్న,
నీ కథ అద్భుతం.
నీ కళ అమోఘం.
నీ ప్రేమ అనంతం.
నీ కరుణ సముద్రం.
నీ ఆవేశం క్షణికం.
నీ ఆలోచన ఆకాశం.
నీ కోపం ప్రళయం.
నీ శాంతం శిఖరం.
నీదనే మా ఈ జీవితం ధన్యం.
నువ్వే లేని ఆలోచన వ్యర్థం.
నువ్వు గుర్తు రాని క్షణమే మరణం.
నువ్వే, సత్యం.
నువ్వే, శివం.
నువ్వే, సుందరం.
శివా శివా శివా అనే పలుకే ఆనందం.
శివమే జీవితం.
శివమే అమృతం.
శివమే శాశ్వతం.
అనంత కోటి బ్రహ్మాండాలకు నువ్వే లయం.
ఆనందపు సాగరం నువ్వే.
అదుపులేని అశ్రువులకు ఆధారం నువ్వే.
పెంచేది నువ్వే.
తెంచేది నువ్వే.
మంచి నువ్వే.
విలువను తెచ్చేది నువ్వే.
మార్చేది నువ్వే.
విలువగా మలిచేది నువ్వే.
నువ్వు లేని జగమేది.
నువ్వు కాని క్షణమేది.
నీలోనే సర్వం.
నీతోనే నిత్యం.
అనంతం, అఖండం, నీ నామ స్మరనే అతి మధురం.
నిరంతం, నిర్వేధ్యం, నీ కంటి చూపే మా ముక్తి మార్గం.

హర హర మహాదేవ శంభో శంకర...
హర హర మహాదేవ శంభో శంకర...

నువ్వు కళ్ళు మూస్తే ఆగిపోతుంది కాలం.
నువ్వు కన్నెర్ర చేస్తే ఆగిపోతుంది పాశం.
నువ్వు అనుగ్రహిస్తే అది ప్రసాదం.
నువ్వు ఆదేశిస్తే అది శాసనం.
నువ్వు అనుమతిస్తే అది ఆశయం.
నువ్వు అడుగులేస్తే అది ఆలయం.
నువ్వే మా దైవం.

నీ ధ్యాసలొనే మా ఈ జీవితం..

Comments

Trending