నా జీవితంలోని నిజాలు

  • ఆడదాని అందమనే మోహం తగలగానే మగాడినని గురుతొచ్చే వికృతమైన జీవనం నాది..
  • అందమైన జీవితం అందుబాటులోనే ఉన్నా అవసరానికి మించి ఆశపడి ఉన్నదానిని చేజార్చుకునే ఉత్తమమైన మనస్తత్వం నాది..
  • మంచి చెడులకి మధ్యలో నిలబడి ఆలోచనచేత మంచివైపు మొదలెట్టి చివరికి అత్యంత శులభమైన చెడు చేసే మంచివాడిని..
  • మంచా, చెడా అని ప్రశ్న వస్తే చాలా సేపు మంచితనమే మార్గమని నమ్మి చివరికి చెడే చేసే మంచివాడిని నేను...
  • అన్నీ నిజాలే చెప్పాలి ఇక అని గట్టిగా నిర్ణయించుకునిఅవసరం రాగానే అబద్ధం చెప్పే అమాయకత్వం నాది..
  • ప్రపంచాన్ని గెలవాలనే కలలున్నా కనీసం నాలోని కోపాన్ని, స్వార్థాన్ని కూడా జయించలేని వీరుడిని..
  • మనిషిగా బ్రతకడమే సరిగ్గా చేతకాకపోయినా రాముడు, కృష్ణుడు అంటూ దేవుళ్ళు చేసిన పనులతో పోల్చుకునే పిచ్చితనం నాది..
  • నా జీవితంలో డబ్బు విలువ, సమయం విలువ సరిగ్గా తెలుసుకోలేకపోయాను. అందుకే నాకు సమయానికి అవసరమైన డబ్బు దొరకదు.
  • నిజం చెప్పే అవకాశమున్నా, అబద్ధం చెప్పే అవసరాన్ని వెతుక్కునే అసలు సిసలైన మానవత్వం నాది..
  • ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ధర్మాన్ని పనికట్టుకుని ప్రశ్నిస్తూ, నా స్వధర్మాన్ని మర్చిపోయే మేలుజాతి రత్నాన్ని నేను..
  • నేను మినహా మిగిలినవన్నీ నాకెందుకనే ఆలోచనే నాకోసం నాకింత సమయం మిగిలేలా చేసింది..
  • తప్పు చేసిన ప్రతిసారి తప్పించుకోవడానికి మరొకరిని బాధ్యుల్ని చేస్తూ నిందించడం అలవాటైపోయింది..


" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending