నా చేదు నిజం
పెదాలపైన పదాలు చూస్తే తేనె పలుకులు
నిగూఢమైన గుండెలోన చేదు గుళికలు
ప్రేమ ఉన్నవారిలాగా నోటి మాటలు
నమ్మించి మోసగించుటేగా అసలు చేష్టలు
తప్పు తప్పు పెద్ద తప్పు అంటూ కోతలు
చేసేవి అన్నీ నీతి లేని కుక్క కూతలు
నాది నీది అన్న చోటే వచ్చె గొడవలు
నాది తప్ప వేరొకటి లేదు అనే పెద్ద డాబులు
నచ్చకున్నా మెచ్చుకుంటూ ఇచ్చే కితాబులు
మురిసిపోయి మరచిపోతే జరిగిపోవా తప్పులు
" నిజాన్ని నిర్భయంగా చెప్పలేము అన్నా తప్పు లేదు సోదరా..
అబద్దాన్ని నమ్మి నిజాన్ని విడిచిపెడితే తప్పవు కష్టాలు నమ్మరా.. "
నిగూఢమైన గుండెలోన చేదు గుళికలు
ప్రేమ ఉన్నవారిలాగా నోటి మాటలు
నమ్మించి మోసగించుటేగా అసలు చేష్టలు
తప్పు తప్పు పెద్ద తప్పు అంటూ కోతలు
చేసేవి అన్నీ నీతి లేని కుక్క కూతలు
నాది నీది అన్న చోటే వచ్చె గొడవలు
నాది తప్ప వేరొకటి లేదు అనే పెద్ద డాబులు
నచ్చకున్నా మెచ్చుకుంటూ ఇచ్చే కితాబులు
మురిసిపోయి మరచిపోతే జరిగిపోవా తప్పులు
" నిజాన్ని నిర్భయంగా చెప్పలేము అన్నా తప్పు లేదు సోదరా..
అబద్దాన్ని నమ్మి నిజాన్ని విడిచిపెడితే తప్పవు కష్టాలు నమ్మరా.. "
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment