నా సందేహం

సందేహంలొనే మన సమర్ధత దాగి ఉంటుంది.
ఏదైన ప్రశ్న ఎదురైతే ముందుగా సందేహ పడినవాడే, సమాధానం వెతికే ఆలోచనలో పడ్డాడని అర్థం. సృష్టిలోని ప్రతి కొత్త విషయం ఎవరో ఒకరి సమర్ధత వల్ల సాధ్యమైందనే నమ్ముతాం. కానీ, అది అతనికి మన కన్నా ముందు కలిగిన సందేహమని తెలుసుకోలేం.
ఆపిల్ చెట్టు నుండి పండు క్రింద పడితే తీసుకుని తినేవాడు గురుత్వాకర్షణ గురించి ఆలోచించలేదు, ఎందుకు పడిందా అని సందేహపడినవాడే ఆలోచించాడు దాని సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించాడు.
ప్రతి సందేహంలోను మనకి అర్థం కాని ఒక సందేశం కూడా కలిసే ఉంటుంది.

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending