మరచిపోలేని ప్రేమ

ఎక్కడో దారులు కనిపించనంత దూరంలో
గూటికి చేరిన పక్షులు చేసే శబ్దం
ఎదురుగా తెరలా కప్పేసే పొడవైన చెట్లు
మనసు తేలేలా వీచే అల్లరి గాలి
ఆకాశమంతా నిండిపోయిన చిన్ని చిన్ని చుక్కలు
ఆ చుక్కల మధ్యలో చల్లని చంద్రడు
మెల్లి మెల్లిగా కురిసే మంచు
ఆ మంచుకు విచ్చుకున్న నెమలి పించం
సిగ్గుపడి చిన్నగా నవ్వే కళ్ళతో
న్నను పలకరించే నీ చూపులు
ప్రేమగా చాచి నిన్ను చేర్చుకున్న చేతులలో
మౌనంగా నా గుండెలపై వాలిన నువ్వు
ఒకరికి ఒకరై మిగిలిన ఈ క్షణాలు
సమయం తెలియని మాటల్లో గడిచిన తరుణాలు
కాలం తిరిగి ఇవ్వలేని జ్ఞాపకాలు

ఇవి మాటల్లో చెప్పలేనివి
ఎన్నటికీ మరిచిపోలేనివి...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending