నా దారిలో
నడిచా నాదైన దారిలో...
అడుగులు ముందుకు పడనంటున్నా,
వెనకడుకు వేయమనే మాటలు వినపడుతున్నా,
కలిసే వారు కొన్నాళ్లేనని తెలిసినా,
కలిసి నడిచేవారంటూ ఎవరూ లేరని తలచినా,
పాదం కదిలింది స్వేచ్ఛగా...
ఆశలు, ఆశయానికి సారధులుగా
పంతాలు, నేర్పించిన పాఠాలుగా
అవరోధాలు, అంతెరుగని పయనానికి అశ్వాలుగా
అనుక్షణం నన్ను నదిలో నావలా నడిపించాయి...
సముద్రం, పడిలేచే కెరటాలు లేకుండా తీరాన్ని చేరలేదు,
జీవితం, పడదోసే కష్టాలు లేకుండా గమ్యాన్ని చేరుకోలేదు.
అద్భుతం అనిపించిన ఆనవాళ్లే లేవు
అదృష్టం కలిసి వచ్చిన అవకాశాలూ లేవు
అన్నీ సులభంగా దొరికితే ఆ జీవితానికి అర్థమే లేదు...
నడవండి, నిలబడే స్థానం ఎంత ఎత్తయితే పట్టి లాగేవాళ్ల సంఖ్య అంత తగ్గిపోతుంది..
ఎదగండి, ఎంత ఎత్తులో ఉంటే కింద ఉన్న వాడి కష్టం అంత తెలుస్తుంది...
ఎదిగే కొద్దీ ఒడిగిపోండి,
ఒదిగి ఉన్నప్పుడే నలుగురిని గెలుచుకోండి,
నవ్వుతూ బ్రతికేయండి,
నలుగురిని నవ్వించండి...

" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment