నా స్నేహం

స్నేహం,
మన జీవితంలో ఏ బంధమైనా మనకు మనంగా ఎంచుకోగలమంటే అది స్నేహం ఒక్కటే...
దీని కన్నా విలువైనది, ఇంతకన్నా భలమైనది ఈ సృష్టిలో ఉండదంటే అతిశయోక్తి కాదు...
నీ వెంట వందల మంది సైన్యం అక్కర్లేదు,
నీ పక్కన నిన్ను నమ్మిన స్నేహితుడు ఒక్కడు ఉంటే చాలు.
నీ కోసం వేల మంది అభిమానులు రానక్కర్లేదు,
నీ గురించి ఆలోచించే నలుగురు స్నేహితులు వస్తే చాలు.
కష్టం వస్తే చెప్పుకోవడానికి,
సంతోషాన్ని పంచుకోవడానికి,
సరదాగా నవ్వుకోవడానికి,
సమస్యోస్తే ఎదిరించడానికి,
గెలుపోస్తే గర్వించడానికి,
ఓటమిలో ఓదార్చడానికి,
నిన్ను నీలా నడిపించడానికి,
నిమిషం కూడా నిన్ను నిందించకుండా, నీ తప్పులని కూడా క్షమించడానికి సిద్ధపడేవాడు ఒక్కడు నీతో ఉన్నా నిన్ను మించిన వాడు ఇంకెవ్వడూ ఉండడు. ఆఖరికి నీ మనసైనా నిన్ను మోసం చేయగలదేమో కానీ, నిన్ను నమ్మిన స్నేహితుడు మాత్రం ఎప్పటికీ అలా చెయ్యలేడు.

కానీ, కొన్ని స్నేహాలు మాత్రం..
అవసరాల కోసం స్నేహాన్ని వాడుకుంటూ,
విలువనిచ్చే వారితో నిర్లక్ష్యంగా ఉండడం.
చేసిన సాయాన్ని మరిచిపోయి,
నమ్మిన వారిని మోసం చేయడం.
నిన్నటి స్నేహాన్ని వదిలేసి,
రేపటి పరిచయాలకే పరిమితమయ్యాయి.
జీవితంలో నీకంటూ ఒక భాగమిచ్చిన స్నేహితుడిని వదులుకోవడం కన్నా మూర్కత్వం నీ కంటిని నువ్వే పొడుచుకోవడంలో కూడా లేదు.
దయ చేసి స్నేహాన్ని, స్నేహితులని మీ స్వార్థాలకి బలి చెయ్యొద్దు.

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల 

Comments

Trending