నా నువ్వే


నేను నాది అనగలిగేది ఏదైనా ఉందంటే అది నువ్వే.

నాకు తెలిసిన లోకం నువ్వే,
నాకు తెలియని లౌక్యం నువ్వే,
నేను వెతికే స్నేహం నువ్వే,
నన్ను చేరే సౌఖ్యం నువ్వే,
ఎదకి కలిగే భావం నువ్వే,
మనసు పలికే కావ్యం నువ్వే,
కనులు వెతికే కోరిక నువ్వే,
కలలు చూపే వేడుక నువ్వే,
కథలు తెలిపే తరుణం నువ్వే,
కదిలి వచ్చే కానుక నువ్వే,
నా ఆశల అర్థం నువ్వే,
నా శ్వాసల స్వార్థం నువ్వే,
ప్రాణం నిలిపే ప్రేమవి నువ్వే,
నేను ప్రాణం విడిచే తోడువి నువ్వే,

ఈ దూరానికి అత్యాశ ఎక్కువ అందుకే నిన్ను నాకు ఇంత కాలం దూరంగా ఉంచింది. కానీ, ఇక దాని ఆటలు సాగవని తెలియదు పాపం.
నిన్ను చూడాలని కలిగే ఆశలకి,
నిన్ను కలుసుకోవాలనే ఆతృతకి,
అణువణువునా నిన్ను నింపుకున్న నా మనసుకి,
అనుక్షణం నిన్ను వెతికే నా కళ్ళకి,
అతిశయం అనిపించిన నా ఆలోచనలకి...
అనువైన వేళలో, అరుదైన చోటులో..
అల్లరిగా నువ్వు ఎదురవుతావని ఎలా చెప్పను??

                                    " ధన్యవాదాలు "
             
                                             రచన
                                      రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending