వదులుకోకు

మనతో కలిసుండే ప్రతి ఒక్కరూ మన సంతోషానికి కారణం కాకపోవవచ్చు.
కానీ, మనల్ని కోరుకునేవారు ఎప్పటికీ మన బాధకి కారణం కాలేరు.
కొంత కోపం,
కొంచెం స్వార్థం,
కొన్ని సార్లు గొడవలు,
దూరంగా ఉండాలనే నిర్ణయాలు,
ఉండలేక బాధ పడటం,
ఒకరికొకరు ఎదురు పడటం,
మళ్లీ కలవడం,
మళ్లీ గొడవ పడటం,
కలిసిన ప్రతి సారి, పెరిగే ప్రేమ.
చలనం లేని చూపులు,
అంతం లేని ఆశలు,
అర్థం కాని మాటలు,
అన్నింటిలో అలకలు,
అలసట రాదు, ఆకలి వేయదు.
నిద్ర పట్టదు, నిలకడ ఉండదు.
ప్రతి పాట మనకోసమే అనిపిస్తుంది,
ప్రతి చోటు తననే గుర్తుచేస్తుంది,
కొన్ని గాయం చేసే జ్ఞాపకాలు,
ఇంకొన్ని గాయాలను మాయం చేసే అనుభూతులు....
గడిచిన కాలం తిరిగిరాదు,
ప్రతి ఘడియని గుర్తుచేసుకోవడం మరిచిపోదు.
ఒక్కసారి కోల్పోతే, కోలుకోవడం చాలా కష్టం.
అందుకే, మనల్ని కోరుకునే వారిని వదులుకోవద్దు.
తరువాత, ఎంత వెతికినా మీకు దొరికేది వారి జ్ఞాపకాలు మాత్రమే...

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments