నా చెలీ...

చలించిపోయింది నా హృదయం, చెలి చూపులు తాకిన నిమిషం.
చూపులతో వల వేసిందో, నవ్వులతో మాయ చేసిందో,
నా మనసులో నిలిచిపోయింది.

కళ్ళతో కలుసుకోవడం, మనసుతో తెలుసుకోవడం అనే మాటలు వింటే నవ్వుకునే నేను మొదటిసారి తన కళ్ళు నన్ను పలకరించగానే నన్ను నేను మరచిపోయాను. మళ్లీ మళ్లీ ఆ పిలుపుల కోసం ఎదురుచూశాను, నన్ను వెతికే ఆ కళ్ళలో కనిపించే ప్రతి భావం నా మనసుతో తెలుసుకున్నాను.
తను ఎదురుపడిన ప్రతి క్షణం, మాటలు తెలియని పసివాడిలా మూగబోయాను. తను దగ్గరగా ఉన్న క్షణాలు, తలమునకలయ్యే సంతోషంలో మునిగిపోయాను. ఒక్క నిమిషం కూడా వదలని తన ఆలోచనల వర్షంలో తడిసిపోయాను. తనకై తపించిపోయాను....


" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

  1. Tanani chusi me heart ela chalinchipoiyindo telidu kani .me matalu chusi na heart chalinchipoiyindi. Meeru tanani entha la love chestunnaro aa ammai ki ardam iyite then really she is lucky . But me matalu me prema me emotions chusaka aa ammai nene ayite bagundedi ani chala sarlu anukunna. Emo avari life lo ki avaru vastaru telidu kada .nenu anukunnadi jarigite really world lo nakante lucky girl undadu.
    Itlu
    Mimmalni amithanga aaradhinche me abhimani.

    ReplyDelete
  2. Meeru tanani antha la aaradhinchadam and anthey goppaga tanu mimmalni poojinchadam .... wah ! Mimmalni chustunte jealous ga undi. Prema ki maru Peru meeru .. both of you are so lucky. .. God bless you ..

    ReplyDelete
  3. All the love to you from me .....be happy 😊

    ReplyDelete

Post a Comment

Trending