నాకు తెలిసిన అమ్మాయి
జన్మలో నీ ముఖం చూడనంటుంది,
క్షణం దూరమైనా క్షమించనంటుంది.
నిజమైనా నీ మాటలని నిలదీస్తానంటుంది,
అబద్ధమని తెలిసినా ఊరుకుంటుంది.
నువ్వెంత త్వరపడినా దొరకనంటుంది,
నేనెంత ఆలస్యం చేస్తున్నా ఎదురుచూస్తుంది.
ఎంత ఆరాటపడినా అందనంటుంది,
అడగకుండానే నా అరచేతుల్లో ఒదిగిపోతుంది.
నావైన అన్నిట్లో తానే ఉండాలంటుంది,
తన నీడనైనా నాతో చూసి భరించనంటుంది.
నీతో బ్రతకడం కష్టమంటుంది,
కలలోనైనా నన్ను వదిలి వెళ్లనంటుంది.
కనిపించగానే కోపంతో దూరమౌతుంది,
కాసేపట్లో కౌగిలిలో కరిగిపోతుంది.
అస్సలు అర్థం చేసుకోనంటుంది,
అర్థంలేని మాటల్లో కూడా ప్రేమని చూస్తుంది...
అమ్మాయిల మాటల్ని అర్థం చేసుకోవడం,
ఆకాశంలోని చుక్కల్ని మార్చి మార్చి లెక్కబెట్టటం ఒక్కటే..
ఎందుకంటే అది ఎప్పటికీ పూర్తికాదు...
క్షణం దూరమైనా క్షమించనంటుంది.
నిజమైనా నీ మాటలని నిలదీస్తానంటుంది,
అబద్ధమని తెలిసినా ఊరుకుంటుంది.
నువ్వెంత త్వరపడినా దొరకనంటుంది,
నేనెంత ఆలస్యం చేస్తున్నా ఎదురుచూస్తుంది.
ఎంత ఆరాటపడినా అందనంటుంది,
అడగకుండానే నా అరచేతుల్లో ఒదిగిపోతుంది.
నావైన అన్నిట్లో తానే ఉండాలంటుంది,
తన నీడనైనా నాతో చూసి భరించనంటుంది.
నీతో బ్రతకడం కష్టమంటుంది,
కలలోనైనా నన్ను వదిలి వెళ్లనంటుంది.
కనిపించగానే కోపంతో దూరమౌతుంది,
కాసేపట్లో కౌగిలిలో కరిగిపోతుంది.
అస్సలు అర్థం చేసుకోనంటుంది,
అర్థంలేని మాటల్లో కూడా ప్రేమని చూస్తుంది...
అమ్మాయిల మాటల్ని అర్థం చేసుకోవడం,
ఆకాశంలోని చుక్కల్ని మార్చి మార్చి లెక్కబెట్టటం ఒక్కటే..
ఎందుకంటే అది ఎప్పటికీ పూర్తికాదు...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment