Happy Birthday Keerthana

కొన్ని మాటలు కలిసిన పరిచయం,
మరికొన్ని ఆలోచనలు తెలిపిన అభిమానం,
అభిమానం ఒక అడుగు ముందుకు వేసిన స్నేహం,
ఆశ్చర్యంగా ఈ రోజు ఈ మాటల వెనుక నిలిచిన కారణం.
సున్నితంగా తిరస్కరించే తన మౌనం,
సౌమ్యంగా అంగీకరించే తన వ్యక్తిత్వం,
ఎంత దాచిన దాగని తనలోని పసితనం,
అలుసుగా తీసుకున్న ఎవ్వరికైనా
సూటిగా సమాధానం ఇవ్వడం తన నైజం.
అబ్బురపరిచే ఆలోచనల వైనం,
ఆలోచింపచేసే మాటల వ్యూహం,
అలుపెరుగని ఆశల వలయం,
ఇన్ని ఉన్నా అధ్బుతం అనిపించే చిరునవ్వులు తరగని జీవితం.
ఇదే కదా, మనం అందరిలో వెతికే లక్షణం...
ఇంత చెప్పిన తరువాత, అంత మంచితనం ఎవరో చెప్పకపోతే ఎలా??
కీర్తనలు వింటే కలిగేంత తన్మయత్వం,
తన స్నేహంలో చూడగలిగాను అంటే అతిశయోక్తి కానే కాదు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించి నిలబడే తన స్వభావమే తనని కీర్తించే కిరీఠాలపై కూర్చోబెట్టాలని కోరుకుంటూ..
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
                      " కీర్తన.. "

Comments

Trending