నా జీవితం నువ్వే
ఎంతని చెప్పను, ఇంకా ఎంత కాలమని చెప్పను
కళ్ళ ముందే నువ్వు కనబడుతున్నా ,
చూసి చూడనట్టు వెళ్లిపోతున్నా,
నా మనసుకి కష్టం కలుగలేదు.
ఎందుకంటే నా కళ్ళతో నిన్ను చూసుకోగలుగుతున్నానన్న సంతోషం.
ఆకాశానికి నిచ్చెన వేశానని కొందరు,
అవకాశం దొరకదని మరి కొందరు నిరాశపరిచినా,
నా ఆరాటం మాత్రం చెక్కు చెదరలేదు.
నిన్ను చూడటం ఇష్టం,
నీకు ఎదురుపడటం ఇష్టం,
నీ చుట్టూ తిరగడం ఇష్టం,
నువ్వు కనిపించకపోతే
నిన్ను వెతుక్కోవడం ఇష్టం.
నువ్వు నడిచే దారి,
పీల్చే గాలి,
పలికే మాట,
తీసే రాగం,
నీ చిరు నవ్వు,
వేసే ప్రతి అడుగు నాకు ఇష్టం.
నా చుట్టూ ఇంతటి రంగుల ప్రపంచం ఉన్నా,
నేను కోరుకునే ఇంద్రధనస్సువి నువ్వే.
ఎన్నెన్ని హంగులు ఆర్భాటాలు ఆకర్షించినా,
నా కనులు వెతికే సౌందర్యం మాత్రం నువ్వే.
నువ్వు కానిది బంగారమైనా అది వ్యర్థమే..
అడిగి చూడు అనుమానం ఉంటే,
అడగాల్సిన అవసరమే లేదు నా జీవితం నువ్వే..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment