నా ఆశ

ఒక్క సారైనా నా వైపు చూడకపోతుందా,
ఒక్క క్షణమైనా నా గురించి తలువకపోతుందా అని చిన్ని ఆశ...
తను ఎదురుపడిన ప్రతిసారి ఎగసిపడే అలలాగా నా గుండె చప్పుడు పెరిగిపోతోంది,
కంటపడకపోతే కుదురుగా నిలబడని మేఘంలా మనసు తనకై వెతకమంటోంది,
అడుగులు ఆగడం లేదు,
పెదవులు తన పేరు పిలువని క్షణమే లేదు,
మనసుకి మర్చిపోవాలనే అలవాటే గుర్తు లేదు.
ఏ ఆధారం లేని ఆ నింగికి ఆకర్షణతో నిండిన ఈ నేల వేసే నిచ్చెనలా,
ఏమాత్రం అవకాశం లేని ఆశకి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను.
అయినా అలసట లేదు,
ఆశలు వదులుకునే ఆలోచనే లేదు,
తరాలు మారినా, యుగాలు ముగిసినా చెదరని ప్రేమ కోసం
క్షణానికో మార్గన్నీ వెతుక్కుంటూ చరిత్రలో మిగిలిపోతానే కానీ,
నా ఆశకి చెదలు పట్టనివ్వను.

                                 " ధన్యవాదాలు "

                                        రచన
                                రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending