పసి హృదయం

కనులకి కదలిక తెలియని ఒక కథ మొదలైనది
వెతికిన ప్రతి క్షణమున పసి హృదయము ఎదురైనది
ఇది వరమో నాలో జరిగే తపనకి ఫలమో 
మనసుకి తెలియని ముడి పడినది
నిజమేనేమో, సమాధానం కోసం వెతికితే సంతోషం దొరికింది
అర్థం కాలేదని అడిగితే అధ్బుతం జరిగింది
ఈ విశ్వమంతా ఒక్కటై నన్ను తనతో నడిపింది
ఎటు వెళ్లినా చివరికి నా గమ్యం తానేనని తెలిపింది..

                                        " ధన్యవాదాలు "

                                               రచన
                                       రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments