జ్ఞాపకాలే ఇక నా జీవితం..

జ్ఞాపకం అర్థంలేని మూర్ఖత్వం జ్ఞాపకం
అర్థం చేసుకోలేని వయసు జ్ఞాపకం
అర్థమంటూ కాని ఆవేశం జ్ఞాపకం
జ్ఞాపకంగా మారిన నేను జ్ఞాపకం
నన్ను నేను మరిచేలా చేసిన ప్రేమ జ్ఞాపకం
ప్రేమను పంచిన నువ్వు జ్ఞాపకం
కోరికల వలలో కరిగిన కాలం జ్ఞాపకం
తీరని కోరికల కోసం చేజార్చుకున్న జీవితం జ్ఞాపకం
అవసరంలేని కోపం జ్ఞాపకం
అణువంతదానికి అనుమానం జ్ఞాపకం
అణుక్షణమునా ఆగని ఆలోచన జ్ఞాపకం
ఆలోచనలో కూడా నన్ను వదలని నీ నవ్వు జ్ఞాపకం
మధురమైన నీ మాట జ్ఞాపకం
మృధువైన నీ పెదవి జ్ఞాపకం
పెదవిపై నా పంటి గాటు చేసిన గాయం జ్ఞాపకం
నా చేతులు చుట్టుకునే నడుము జ్ఞాపకం
నడుముని తాకినంతనే నీ సిగ్గు జ్ఞాపకం
సిగ్గుల బుగ్గలపై నేను పెట్టిన ముద్దులు జ్ఞాపకం
అరక్షణమైనా వదలని కౌగిలి జ్ఞాపకం
అరవై ఏళ్ల జీవితానికి కన్న కలలు జ్ఞాపకం
ఆ జ్ఞాపకాలతో నిండిన నా కన్నులు జ్ఞాపకం
కన్నుల నుండి జారిన కన్నీరు జ్ఞాపకం
జ్ఞాపకం నాకోసం నువ్వు జ్ఞాపకం
జ్ఞాపకం నీకై వేచిన నేను జ్ఞాపకం
జ్ఞాపకాలే ఇక నా జీవితం...


                                    " ధన్యవాదాలు "

                                           రచన
                                   రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

  1. Enno kriyalu inkenno anubhavalu avanni oka gnapakam ga migilipothayani telisina nadu Mana pedhavipai vachey chirunavvu Kanna Mana kallalo ninde aa kannirey manaki teliyajesthundhi avanni Mana manasuni entha hatthukunnayo entha kadhilinchi vesayo Ani........

    But really it is very heart touching words JAI

    ReplyDelete

Post a Comment

Trending