Happy Happy Happy
నాకు ఏదైనా మొదలుపెట్టడం కష్టం, కాదు భయం. ఎందుకంటే అదెక్కడికెళ్లి ఆగుతుందో తెలియదు. అందుకే ఇప్పటివరకూ నీకు ఈ విషయం చెప్పలేదు.
నువ్వు కూడా ఇది చదివాక, ప్రపంచానికి ఎప్పుడూ దీని గురించి చెప్పకు, ఎవ్వరికీ చూపించకు. చెప్పినా పెద్దగా నమ్మబుద్ది కూడా కాదు. కానీ, ఇదే నిజం. నువ్వు ఒప్పుకోవని తెలుసు. నీకిది తెలిసాక నవ్వుకుని వదిలేయొచ్చు, కోప్పడచ్చు, ఏమో ఎం చేస్తావో నీ ఇష్టం. అలా అని భయపడుతూ చెప్పకుండా దాచేస్తే తప్పుచేసినవాడిని అవుతానేమో అనిపించింది.
అసూయపడే కళ్ళకి నువ్వు అందం
ఆశ్చర్యపడే వాళ్ళకి నువ్వు అద్భుతం
అర్థంచేసుకునే మనసుకి నువ్వు అందిన అవకాశం
ఆలొచించలేని మనుషులకి నువ్వు అందని ఆకాశం
అల్లరిలో అసలుసిసలైన జాతిరత్నం
ఆశలతో అంచులు దాటి ఎగిరే గాలిపఠం
అరవై ఏళ్ళ జీవితాన్ని ఇరవైలలోనే అంచనా వేయడం నీకే సాధ్యం అయ్యింది.
అందుకే ఇన్ని నీలో ఉన్నందుకే నీకు ఈ ఘనత దక్కింది..
నీకు మాత్రమే దక్కాల్సింది నీకు దక్కేసింది నిజంగా సంతోషంగా అనిపించింది...
నువ్వు పిచ్చిలో PHD చెయ్యడం పూర్తయిపోయిందోచ్చ్..
నాకు తెలుసు నీకు పట్టరాని సంతోషంగా ఉంటుంది అని కానీ కానీ నీకు ఇంక తిరుగేలే.. పిచ్చిపిచ్చిగా పిచ్చిపట్టిన ఈ పిచ్చిరొజుతో పిచ్చిని పంచడం మొదలుపెట్టు దీపు మొదలుపెట్టు.. హ్యాపీ పిచ్చి డే Dr. పిచ్చిపూసల పిచ్చక్క దీపిక పవార్.. 🤣🤣🤣🎊🎉
Comments
Post a Comment