తిరుపతి

Rondom person with another random person

Random : మా తిరుపతి ఇంత, మా తిరుపతి అంత.. తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత అన్నావ్.. కొండ తప్ప ఏమీ కనిపించట్లేదు..

Antu undagane hero entry 

Hero : బైపాస్ రోడ్లో బస్ ఎక్కి బయల్దేరితే కొండ కాక ఏం కనిపిస్తది అన్న.. బండేసుకుని అలా బజారులోకేళితే కదా అసలైన తిరుపతి తెలిసేది. తలెత్తి ఏడు కొండలు చూసి ఎల్లిపోతావ ఏంది. మా ఏడు కొండల సామిని చూడవా ?? చూడాలంటే ఎంత పెద్ద క్యూ లైన్ ఉంటుందో తెలుసా ?? అంత పెద్ద లిస్టు ఉంటుంది మా తిరుపతి విచిత్రాలకి కూడా..

Random : అవునా బాబు, ఏంటా లిస్టు..

బజార్ స్ట్రీట్ బంగారం కోసం
ప్రకాశం రోడ్డులో పుస్తకాల కోసం
పండగొచ్చినా, పబ్బమొచ్చినా కిట కిటలాడే T.K స్ట్రీట్ మెరుపులు చూడాలన్నో..
వెంకటాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, గరుడ, ఇందిరా అంటూ express train లు బస్ లు ఎక్కి నీలాగే రోజుకి ఎంత మంది యాత్రికులొస్తారో తెలుసా అన్నా.. మాకు రోజూ అతిధి ఆహ్వానాలతో, గోవింద నామాలతో.. అలా మొదలవుతుంది.

అన్నట్టు మీకు తెలీదు అనుకుంటా, మాకు airport facility కూడా ఉంది.

బాహుబలి సినిమాలో వార్ లు చూసుంటావ్ అన్నా, కానీ ఇక్కడ సినిమా రిలీస్ అవ్వగానే పోస్టర్లు, బ్యానర్లు, కట్ అవుట్ లతో పాటు మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ జరిగే కొట్లాటల్లో ఉంటాదన్నా మజా.. ఇక్కడ మాకు రోజు ఉంటది.

మా ఊరు అన్ని కళలకి ప్రసిద్ధమే, అందులో చోరకళ మాత్రం ప్రత్యేకం అన్నో.. ప్యాంట్ కి తెలీకుండా పర్సు కొట్టేయడం తెలుసా..??

Randam : అంటే ??

అనగానే హీరో తన చేతిలో ఉన్న పర్సు చూపిస్తాడు.

Random : అమ్మో నా పర్సు

అని లాక్కుంటాడు

Hero : నిలువు దోపిడీ ఇక్కడ ఫెమస్ అన్నా..

పొద్దున్నే వాకింగ్ కోసం మా మునిసిపల్ పార్క్,
వాటర్ ఫాల్ కావాలంటే కపిలతీర్థం
అడుగు అడుగుకి ఆపి హారన్ కొట్టే మా కొండ బస్సులు, 
అందమైన అమ్మాయిల కోసం బస్ స్టాప్లో ఎదురుచూసే కాలేజీ కుర్రాళ్ళు..
అతి పెద్ద మెడికల్ కాలేజ్
200 ఎకరాలలో ఉన్న జూపార్కు..

ఎటు చూసినా కనిపించే మూడు నామాలు,
ఏడాదికొకసారి వచ్చే గంగమ్మ జాతర, అసలు అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో కూడా తెలుసుకోవడం కష్టం తెలుసా..

మా వాళ్ళకి సినిమాలు అంటే ఎంత పిచ్చంటే, అప్పుడెప్పుడో ఉండేది లీలామహాల్ థియేటర్. ఇప్పుడు లేకపోయినా పేరు మాత్రం మా వాళ్ళు ఇంకా మర్చిపోలేదు.

రెడ్డెమ్మ హోటల్ లో నాటు కోడి ఫేమస్
నెల్లూరు మెస్ లో ఫుడ్ పార్సిల్స్
చిల్లీస్ లో చికెన్ బిరియాని
ఆంధ్రా స్పైస్ లో అన్నీ specials ఏ..

అలిపిరి దాటి ఘాట్ రోడ్డు ఎక్కితే ఉంటాదన్నా...... ఊటీ, మనాలి కూడా వేస్ట్ తెలుసా?? అక్కడ నిల్చుని చూడాలి మా తిరుపతి అందం. కళ్ళు జిగేలు మానాలి అంతే..

శ్రీవారి పాదాలు మొదలుకుని
108 శేషాతీర్థాలు
స్వామి వారి శిలా తోరణం
చంద్రగిరి కోట
అమ్మవారి గుడి
అడుగడుగునా దండాలు పెడుతూ సాగే అలిపిరిమెట్టు
మా చుట్టూ ఈ ఏడు కొండలు.. ఇలా ఒకటా రెండా బ్రతికితే ఇక్కడే అన్నా..

పుణ్యం, పురుషార్థం రెండూ కావాలంటే ఇక్కడ ఉంటే చాలు

గోవిందా గోవింద...

                                    రచన
                            రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending