నా మొదటి పాట

పాటలు పాడటం ఎంతటి కష్టమో వ్రాయడం కూడా అంతే కష్టమని నాకూ ఈ మద్యే తెలిసింది.

ఇది నా జీవితంలో రాసిన మొదటి పాట... 

నువ్వు లేని ఈ ప్రేమ...
పూవులే లేని కొమ్మ...
ప్రాణమే లేని బొమ్మ...
నిన్ను చూడని జన్మ...
                                వేయి జన్మాలకైనా నాలోని ప్రాణమే నీవు...
                                నేడు నిజమైతే చాలు నాతో నీవు నూరేళ్ళు...
నువ్వు లేని ఈ ప్రేమ...
పూవులే లేని కొమ్మ...
ప్రాణమే లేని బొమ్మ...
నిన్ను చూడని జన్మ...
                                 కోటి రాగాల వీణ నీ మాటలో తేనె వాన...
                                 నీవు లేకుంటే మైనా నా ప్రాణమే ఆగిపొదా... అనుకున్నా..

కన్న ప్రేమనే మరిచేలా నీ కన్నె ప్రేమనే కోరానే...
నమ్మి నీకు నీ తోడైతే నను దూరం చేసావే...
నిను కోరుకున్నది నా హృదయం...
నన్ను వదులుకున్నది నీ పంతం... చెలియా...
నీకు సొంతమైనది సంతోషం...
నాకు చేరువైనది ఓ శోకం... సఖియా...
ఆ అంబరాన నిను నిలబెడితే, నా గుండె పైన నిను జోకోడితే...
నా గండె కోసి ఓ గాయం చేసావే, నా ప్రాణం తీసావే...
నువ్వు లేని ఈ ప్రేమ...
పూవులే లేని కొమ్మ...
ప్రాణమే లేని బొమ్మ...
నిన్ను చూడని జన్మ...

లక్ష దీపాలలోన నా లక్ష్యమై నిలచినావే...
శిక్షలా మారినావే ఆ మోక్షమే చూపినావే...
నీ పేరే నా ప్రేమ...
నా ప్రేమకి నీవేలే చిరునామా...
నీ పేరే నా ప్రేమ...
నా ప్రేమకి నీవేలే చిరునామా...
వోడిపోయిన నీ కోసం...
అది గెలుపులో లేని సంతోషం...
తెలుసా ఓ మైనా...
నీకై నేను లేనా....
నువ్వు లేని ఈ ప్రేమ...
పూవులే లేని కొమ్మ...
ప్రాణమే లేని బొమ్మ...
నిన్ను చూడని జన్మ..

                                                           " ధన్యవాదాలు "
                                                                                                                       రచన
                                                                                                               రెడ్డి ప్రసాద్ మల్లెల 

Comments

Trending