నా ఊహాలోకం (My ImaGination)
ImaGination - ఊహించుకోవడం
మనిషికి ఉండే అత్యంత గొప్ప శక్తులలో ఊహా శక్తి కూడా ఒకటి. ఏదైనా విన్నప్పుడు, దేనినైన ఆలోచిస్తున్నప్పుడు, ఇంకేదైనా తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా కొన్ని సందర్భాలలో వాటి గురించి ఊహలు మొదలవుతాయి. వీటికి ఒక నిర్దిష్టమైన (Particular) సమయం అంటూ ఏది ఉండదు. అనంతమైన ఈ విశ్వాన్ని కూడా అలా మన కనుపాపలలో నిలిచేలా చేయగలవు. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేలా చేయగలవు.
నా విషయంలో ఇవి ఇంకాస్త ప్రత్యేకం, నా ఊహలకి ఒక అంతూ అదుపూ అంటూ ఎప్పుడూ లేదు. అత్యంత విలువైన, ముఖ్యమైన విషయాలను వింటున్న సమయాలలో కూడా నా ఆలోచనలు నా ఊహల చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒక విషయాన్ని నేను ఆలోచించడం మొదలు పెడితే అవి బహుశా ఇది వరకు ఆలోచించినవి కావొచ్చు లేదా అప్పటి నా కోరికల వల్ల కలిగిన ఆలోచనలు కావొచ్చు వాటి గురించి నేను ఊహించుకోవడం మొదలు పెట్టేవాడిని. అందులో నా జీవితానికి మరియు నా ఆశలకి సంబంధించిన అన్ని విషయాలని జోడించి నాకు నచ్చినట్టుగా ఊహించుకునే వాడిని. ఏదైనా అత్యవసరమైన పరిస్థతి ఎదురైతే లేదా వేరే ఎవరితో ఐనా నీను మాట్లాడవలసి వస్తే గాని ఆ ఊహల నుండి నేను బయటకు వచ్చేవాడిని కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఊహించుకున్న ఏ విషయమైన మళ్ళీ ఏ క్షణంలో ఐనా నేను కొనసాగించగలను అంటే గుర్తు తెచ్చుకుని అదే స్థితిలో మళ్ళీ ఊహించుకోవడం సాధ్యమయ్యేది.
కొన్ని విషయాలకు సంబంధించి లేదా కొంత మంది వ్యక్తులకి సంబంధించిన ఊహలలో భవిష్యత్తుకి ఉపయోగపడే ఎన్నో విషయాలు నాకు కనిపించేవి. వారి ప్రవర్తనలో మార్పులు, జరగబోయే ప్రమాదాలు, భాదపడవలసిన విషయాలు మరియు మంచి విషయాలు ఇలా అన్నీ ప్రత్యక్షంగా చూసినట్టుగా తెలిసేవి. చాలా వరకు ముందుగానే హెచ్చరించే అవకాశం ఉండేది. కాని, ఎవరైనా నా మాటలు నమ్ముతారా అనే ఆలోచన నన్ను వాటిని బయటకు చెప్పనీయకుండా ఆపేవి. అలా నేను ఊహించిన మరి కొద్ది క్షణాలలోనే కొన్ని కళ్ళ ముందు జరిగిపోయేవి. నమ్మే అవకాశం ఉన్నా జరిగిపోయాక చెప్పినా వచ్చే ఉపయోగం ఏది ఉండదని తెలుసుకుని మౌనంగా ఉండిపోయే వాడిని.
ఇలాంటి ఒక సంఘటనని గుర్తుచేసుకుంటూ....
కొద్ది రోజుల క్రితం, ఎదా విధిగా ఆఫీస్ నుండి కార్లో బయలుదేరాను. కార్లో కూర్చున్న దగ్గర నుండి నాకెందుకో ప్రమాదానికి సంబంధించిన ఆలోచనలు కలుగుతున్నాయి. అప్పటి వరకు ఏ రోజు నేను సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మరియు డ్రైవర్ ని కూడా పెట్టుకోమని చెప్పాలని నేను అనుకోలేదు. ఆ రోజు చెప్పాలనిపించింది. వెనుక కూర్చొని వచ్చే పాటలను వింటూ హుషారుగా ఉన్న నా స్నేహితులకి గాయాలు తగిలినట్టుగా నా ఊహలో కనిపిస్తోంది. ప్రమాదం జరుగుతోందని తెలుసు కాని, జరగకుండా ఉండాలని గట్టిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇంతలోనే రోడ్డుకి అడ్డంగా ఒక ఆవు పరిగెడుతూ వచ్చేసింది. చాలా వేగంగా వస్తున్న డ్రైవర్ కి కారుని అదుపు చేయడం కష్టమైంది. ఇక చెప్పాల్సిన పనేముంది కార్ గట్టిగా తగలడంతో ఆ మూగ జీవి గాయాలు తగిలి కింద పడిపోయింది. వెనుక కూర్చున్న స్నేహితులు హటాత్తుగా బ్రేక్ వేయడంతో ముందుకి వచ్చి తగలడం వల్ల గాయాలు తగిలాయి. ఇలా జరిగిన సందర్భాలు ఇంకెన్నో ఉన్నా ఇది అన్నిటిలోకి చాలా చిన్న ప్రమాదం కనుక దీని గురించి ప్రస్తావించాను.
ఊహలతో మనకు దొరికే మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే, మనకి నచ్చిన ప్రదేశంలో మనకు నచ్చిన సమయంలో మనకు నచ్చిన విధంగా మనల్ని చూసుకోవచ్చు. అక్కడి అందాలని, అద్భుతాలని, ఆశ్చర్యాలని కళ్ళ ముందే జరుగుతునట్టుగా అనుభవించవచ్చు. ఊహలు మన మానసిక ఉల్లాసానికి ఎక్కువగా ఉపయోగ పడుతాయు. మనల్ని మనకు నచ్చినట్టుగా చూసుకోవడం ద్వారా నిజ జీవితంలో కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. దేని గురించి ఐనా ఒక కచ్చితమైన భావనని ఏర్పరుచుకోవడంలో ఊహలు ఎక్కువగా ఉపయోగపడుతాయి.
- ఇవి ఊహల గురించి నేను నా జీవితంలో చూసిన కొన్ని విషయాలు. ఇవి అందరికి ఒకేలా ఉండాలని కాని, అందరికి ఇలాంటి శక్తి ఉండదని కాని అనుకోవడం సరైనది కాదు. ఊహించుకోవడం మనకు మానముగా చేసుకునే ఒక మంచి అలవాటు. ఇదే విషయంపై నాకు ఉన్న అనుభవాలను కలుపుకుని ఇంకొన్ని సంఘటనలని, నేను అనుభవించిన అనుభూతులని మరొక పోస్ట్ లో వివరిస్తాను.
" ధన్యవాదాలు "
Comments
Post a Comment