నా భావాలు
నాన్న....
గంగను తలపై మోసే ఆ శివుడు దేవుడు ఐతే, నన్ను తన భుజాలపై మోసిన మా నాన్న కూడా దేవుడే.
నా ప్రతి అడుగుకి ముందుగా తాను అడుగు వేసి నాకు దారి చూపిన నేస్తం,
నా ప్రతి సంగర్షణలో స్వార్థం లేని సలహాలనిచ్చి నన్ను ముందుకు నడిపిన ధైర్యం.
నొప్పి తగిలితే అమ్మా అని అరిచినా..
ఆ నొప్పి తెలియకుండా పెంచాలంటే మాత్రం అది ఒక్క నాన్నకే సాధ్యం.
ఆ నొప్పి తెలియకుండా పెంచాలంటే మాత్రం అది ఒక్క నాన్నకే సాధ్యం.
కష్టాన్ని, కన్నీళ్ళని, అవమానాలని తాను పడినా..
నన్ను సంతోషంగా ఉండమని దీవించే నిస్వార్థ హృదయం నాన్న.
నన్ను సంతోషంగా ఉండమని దీవించే నిస్వార్థ హృదయం నాన్న.
అదిగో ఏనుగు అంటే ఇదిగో ఇక్కడ అని తనపైకి ఎక్కించుకుని నన్ను నవ్వించే మోసం నాన్న..
కడుపున మోసిన అమ్మ కన్నా ముందు కనిపించగానే ప్రేమించి, వినిపించే గుండె చప్పుడు నాన్న..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment