నా కలల ప్రేమ
కవ్వించే కన్నుల్లోన కలనైనా కాలేనా...?
" ధన్యవాదములు "
ఊరించే నీ పెదవులపై చిరునవ్వై రాలేనా...?
నడిచే ప్రతి అడుగున తోడై నీ జతగా నే లేనా...?
నీ గుండె చప్పుడు కూడా గమనించదు కాస్తైనా...
అది పలికే చిరు మాటైనా నా పేరే ఓ మైనా...
నది నుండి విడిపోతున్నా సెలయేరు ఆగేనా..?
పయనించే దారేదైనా గమ్యాన్నే చేరేనా....
ఏ కోపతాపాలైన ప్రేమని విడిపోయేనా...?
విడిపోయిన మనసులు కూడా ప్రేమించుట మరిచేనా...
కష్టం, కన్నీరు లేని ప్రేమా ప్రేమేనా...?
బాధన్నది లేకుండానే ప్రేముందని తెలిసేనా...
" ధన్యవాదములు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment