నా అందాల హరివిల్లు
ఓ అందాల హరివిల్లా నిను పొందాలంటే వడగండ్లా...
వికసించే పూవుల్లా నువ్వున్నావంటే చిరుజల్లా...
మెరిసేటి ముత్యాలా.. నీ నవ్వుని తాకిన చినుకుల్లా...
సరిగమల సరిజోడా నీ పలుకుల్లో పదనిసలా....
వరమిచ్చిన దేవతలా నిను ప్రేమగ పిలువాలా...
దరిచేరిన ప్రియురాలా నిను తలచిన ప్రణయాలా...
కలసిన ఆ తొలి క్షణమే నిను కోరిన నా మనసే,
మరువదులే ఏ నిమిషం నువ్వు చేసిన చిరు మోసం....
నమ్మింది నా హృదయం నీతోనే అని సంతోషం,
తెలిసింది ఈ నిమిషం మిగిలింది ఓ శోకం...
ఒక వరమై నను చేరావే... చే జారి పోయావే...
వర్షంలా తడిపావే... కన్నీటి విలువని తెలిపావే...
క్షణమైనా మరిచేనా నను మరిచిన నిన్నైనా...
తియ తీయని నీ ప్రేమ చేదెక్కిన విషమేనా...
చెరగని ఓ మచ్చల్లే తగిలింది నీ గాయం...
పగిలిన అద్దంలా మిగిలింది నా హృదయం...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments
Post a Comment