నువ్వే నా...!
నువ్వేనా ?? నా కన్నుల కమ్మని కలవి ??
నువ్వేనా ??
నువ్వేనా ?? నా కలలకి నచ్చిన కథవి ??
నువ్వేనా ??
నువ్వే నా కడలికి అలవి ??
నువ్వే నా జన్మకి జతవి ??
నువ్వే నా వయసుకి వలవి ??
నువ్వే నా మనసుకి మనవి ??
నువ్వేనా ?? నా శ్వాసలు నువ్వేనా ??
నువ్వేనా ?? నా ఆశలు నువ్వేనా ??
నా ఊహల తలపువు నువ్వే...
నా ఊపిరి పిలుపువు నువ్వే...
నా కథలో మలుపువు నువ్వే...
నా ప్రేమలో గెలుపువు నువ్వే...
నువ్వేనా ?? నా సగమంటే నువ్వేనా ??
నువ్వేనా ?? నా నిజమంటే నువ్వేనా ??
ప్రతి అనువున నన్నే మలిచిన వులివంటే నువ్వేనా ??
ప్రతి అడుగున తోడుగా నడిచే నా నీడవి నువ్వేనా ??
నా కథనే కొత్తగ మార్చిన అందం అంటే నువ్వేనా ??
నువ్వేనా ?? నా మదిలో ఉన్నది నువ్వేనా ??
నువ్వేనా ?? నీనంటే అచ్చం నువ్వేనా ??
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment