నా ప్రేమ ప్రతిమ
నా కన్నులు చూసే కలలాగా..
నీ పెదవుల పలికే అలలాగా..
పడినా లేస్తూ, పరుగులు తీస్తూ నన్నే వదలక...
తలచిన క్షణమే తపమవగా...
ఎదురుగ నిలిచి నిజమవగా...
తీయని స్వరమై మదికొక వరమై నను చేరావుగా...
వస్తే వద్దని అన్నాన...?
వెలిపోతుంటే వదిలేశానా..?
వరమే నువ్వని, నమ్మిన నన్నే ఒంటరి చేస్తావా..?
క్షణ క్షణము యుగమై గడిచేలా...
ప్రతి క్షణమూ గురుతే మనసారా...

కంటే అమ్మని అంటాగా..
కలకంటే నువ్వే జత కాగా...
కన్నులు మూస్తూ నిన్నే చూస్తూ కన్నీరే ఆగక...
పెదవులు పలికే ప్రతి మాట నీ పేరని అంటే నమ్మవుగా...
పలుకులు రాని మనసే తెలిపే మాటైనా వింటావా...
రంగులు అద్దిన కాగితమా..
నింగికి నిచ్చెన నీ తరమా...
దారిని చూపిన దారం తెంచి వెలిపోయావుగా...
రాతిని మార్చుట నీ వరమా...
ప్రతిమగ మలుచుట నీ మహిమ...
నీ ప్రతిమని కొలిచి ప్రేమగ పిలిచే నా పిలుపే వినరావా...

"ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment