నా ప్రయాణం

ప్రయాణం,
మూలానికి గమ్యానికి మధ్యలో ఉండేది దూరం
ఆశలకి ఆలోచనలకి మధ్యలో కలిగేది ప్రణయం
గెలుపుకి ఓటమికి మధ్యలో జరిగేది యుద్ధం
చావుకి బ్రతుకుకి మధ్యలో గడిపేది జీవితం...
జీవితంలో చేసే ప్రతీ ప్రయాణం
మనకెన్నో జ్ఞాపకాలతో పాటు,
మరిచిపోలేని అనుభవాలని,
మరెన్నో జీవిత సత్యాలని నేర్పుతుంది...

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments