నిన్ను చేరుకునే వరకూ
సముద్రపు లోతుల్లో మొదలైనట్టుగా
నా గుండెల్లో ఏదో అలజడి,
తీరంలో అలలు ఎగసిపడినట్టుగా
నా శ్వాసలు చేసే శబ్దం,
ఆ నింగి అంచుల్లో మేఘాలు దాగినట్టుగా
నీకై వెతికే నా ఆలోచనలు,
ఈ నేల దాచలేని అధ్బుతమైన నిధిలా
నా జీవితంలోకి వచ్చే నువ్వు,
గాలి తాకిడికి కదిలే పఠంలా
చెలించే ఊహలు,
నీటి ఆవిరికి కురిసే వర్షంలా
జనించే ఆశలు,
నిన్ను చేరుకునే వరకూ,
అడుగులు అలసినా, ఊపిరి సలసినా
చివరికి నా ప్రాణమే పోయినా
నా ప్రయత్నం ఆపను...
నిన్ను మరువను...
నా గుండెల్లో ఏదో అలజడి,
తీరంలో అలలు ఎగసిపడినట్టుగా
నా శ్వాసలు చేసే శబ్దం,
ఆ నింగి అంచుల్లో మేఘాలు దాగినట్టుగా
నీకై వెతికే నా ఆలోచనలు,
ఈ నేల దాచలేని అధ్బుతమైన నిధిలా
నా జీవితంలోకి వచ్చే నువ్వు,
గాలి తాకిడికి కదిలే పఠంలా
చెలించే ఊహలు,
నీటి ఆవిరికి కురిసే వర్షంలా
జనించే ఆశలు,
నిన్ను చేరుకునే వరకూ,
అడుగులు అలసినా, ఊపిరి సలసినా
చివరికి నా ప్రాణమే పోయినా
నా ప్రయత్నం ఆపను...
నిన్ను మరువను...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment