నా ప్రయత్నం

నీకు అవకాశం రాలేదని ఆకాశం క్రిందకి పడిపోదు
నువ్వు జీవితంలో నిలబడలేదని నేల విడిపోదు
నీ తప్పులకు మేఘాలు వర్షాన్ని కురిపించవు
నీ కోపానికి మెరుపులు నిప్పులు వర్షించవు
నువ్వు వచ్చే వరకూ వసంతం వేచి చూడదు
నువ్వు రాలేదని కాలం నిలిచి ఉండదు....

నిరంతరం నీ ప్రయత్నం
నిరాశ పడని, నిన్ను ఆపని ఆశయం
అనంతమైన ఆత్మ విశ్వాసం
అకుంఠితమైన సాధనా బలం
ఇవి నీకు తోడైతే
సమస్యలేన్నైనా
సమాధానం మాత్రం ఒక్కటే
నీ విజయం నీకు ఇచ్చే చిన్ని చిరునవ్వు...

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments