నా అదృష్టం

దించిన తల ఎత్తని అమ్మాయి కావాలా?? తల తిక్క పనులు చేయని అమ్మాయి కావాలా?? అంటే, నేను తల ఎత్తుకు తిరిగేలాంటి అమ్మాయి కావాలని అంటాను..
నన్ను పొందడం అదృష్టం అనుకునే తను రావడం ముఖ్యం. కానీ, తనని పొందడం నా అదృష్టం అవ్వడం నాకు ఇష్టం. రెప్పలు దాచలేని కన్నులు, విరివిగా పెరిగిన తన కురులు, చీరకట్టులో కనిపించే హొయలు, హంసను పోలిన నడకలు, జాబిలిని మించిన తలుకులు, ఆకర్షించే తన చూపులు, అందానికి పాఠం చెప్పే తన నవ్వులు, ఇలా అరవై ఏళ్ల నా జీవితాన్ని నింపేసే తన కోసం క్షణాలని లెక్కపెట్టుకుంటూ, కాలాన్ని నెట్టుకుంటూ తను కలిసే ఆ రోజు కోసం వేచి చూస్తున్నాను..

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending