నా కలలు నిజమైతే
అనుకోలేదు నేనెప్పుడూ, అనుకున్నవి అన్నీ జరిగేనంటూ
కల కనలేదు నేనెప్పుడూ, కలకన్నవి అన్నీ నిజమై ఎదురైనట్టు
కలో నిజమో తెలియదు, కనుల ఎదుట నిలిచింది
అనుకున్నానో లేదో, అద్భుతం జరిగింది
నా అడుగుకి తోడుగా అడుగు వేసే నీడలా చేరింది
ఒక్క క్షణమైనా వదలని ఆలోచనై మారింది
అన్నిట్లో సగమై, నాకు అందిన వరమై ఎదను గెలిచింది...
ఆటపట్టించే అల్లరి ఉంది,
అలిగి గెలిచే అందమూ ఉంది,
ఎదురు నిలిచే తెగువా ఉంది,
ఒదిగిపోయే గుణమూ ఉంది,
తను నాకు కాలం తెచ్చిన కానుకో తెలియదు,
నా జీవితానికి వచ్చిన వేడుకో తెలియదు,
వచ్చింది, గెలిచింది, నా మనసులో నిలిచిపోయింది.
కల కనలేదు నేనెప్పుడూ, కలకన్నవి అన్నీ నిజమై ఎదురైనట్టు
కలో నిజమో తెలియదు, కనుల ఎదుట నిలిచింది
అనుకున్నానో లేదో, అద్భుతం జరిగింది
నా అడుగుకి తోడుగా అడుగు వేసే నీడలా చేరింది
ఒక్క క్షణమైనా వదలని ఆలోచనై మారింది
అన్నిట్లో సగమై, నాకు అందిన వరమై ఎదను గెలిచింది...
ఆటపట్టించే అల్లరి ఉంది,
అలిగి గెలిచే అందమూ ఉంది,
ఎదురు నిలిచే తెగువా ఉంది,
ఒదిగిపోయే గుణమూ ఉంది,
తను నాకు కాలం తెచ్చిన కానుకో తెలియదు,
నా జీవితానికి వచ్చిన వేడుకో తెలియదు,
వచ్చింది, గెలిచింది, నా మనసులో నిలిచిపోయింది.
నన్ను చేరుకోవాలనే తన తపన,
నన్ను వదిలి వెళ్లలేని తన ప్రేమ,
అనుక్షణం ఆరాధనై,
నన్ను అల్లుకున్న అనురాగమై, వచ్చి వాలింది.
నన్ను వదిలి వెళ్లలేని తన ప్రేమ,
అనుక్షణం ఆరాధనై,
నన్ను అల్లుకున్న అనురాగమై, వచ్చి వాలింది.
అదృష్టం అనే మాట కూడా చాలా చిన్నదిగా అనిపించింది,
ఆనందం తన కోటలు దాటి పరుగులు పెట్టింది,
నా అరవై ఏళ్ల జీవితానికి,
ఆనందం తన కోటలు దాటి పరుగులు పెట్టింది,
నా అరవై ఏళ్ల జీవితానికి,
ఇరవై నాలుగేళ్ళ ఎదురుచూపులకి,
తను నాపై చూపించే ఈ పిచ్చిప్రేమ నేను ఊహించనిది.
తను నాపై చూపించే ఈ పిచ్చిప్రేమ నేను ఊహించనిది.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Mee matallo ne telustundi tana presence ni meeru ntha njoy chestunnaro. & mee meeda tanu chupinche prema ... inni rojulu meeru mee preyasi kosam ntha la kalalu kannaro avi anni ippudu aa ammai prema lo nijam ga experience chestunnaru. You people are sooooo lucky . Ee abhimani always oka abhimani la ne undi potundi. ..... mee kalalu njm aiyayi .na kalalu alage migili poyayi.
ReplyDeleteItlu Me abhimani ....