తరించిన సమయం

తపన పడి, తపన పడి, తరించెనే సమయం
చెలియ ఒడి, అలల జడి, వరించెనే ప్రణయం
వడి వడిగా ఒడిలో, త్వరపడవా పనిలో
నడుము మడత తడుము వేళలో....

తపన పడి, తపన పడి, తరించెనే సమయం
మనసు పడి, మధన పడి, సుఖించుకో తరుణం
ముడిపడవా నా ఎదసడితో, జాతపడవా ఈ మధనుడితో
సై అంటూ, సై సై అంటూ, శృతి మెత్తగ మొలకెత్తగ నాలోన ఆశలే
వరమై దొరికేనా, వరదై ముంచేనా, వలపు వర్షంలో తడిసేనా
చిన్నదే, ఈ జగమే చిన్నదే. ఉన్నదే నీపై ఆశే ఉన్నదే...
రతించనా రేయి, అందించనా చేయి,
రకరకాలుగా శృతించనా, ఇదే కదా హాయి....

తపన పడి, అరరే తపన పడి,
తపన పడి, తపన పడి తరించెనే సమయం
కలత చెడి, వయసు ఒడి, ఊరించెనే పరువం
వస్తా, నీకై వస్తా, ఇస్తా, వరమే ఇస్తా...
చూస్తా, నిన్నే చూస్తా, వేస్తా, నీపై కన్నే వేస్తా...
కదలి వచ్చి, నా కౌగిల్లు ఇచ్చి, ఊరిస్తా వాటేస్తా
కోరింది ఇచ్చి, నీ పొందుకొచ్చి, మురిపిస్థా మరిపిస్తా
నువు చూడని లోకాలే చూపిస్తా..
బాగుందిరా వేడి, చూపించరా వాడి,
వలపు గుర్రమెక్కి నువ్వు చేసేయ్యరా స్వారీ..
చెయ్యాలిరా భోని, అవ్వాలిరా కాలీ,
పిండేసుకో పిచ్చెకించే అందాలేరా అన్నీ...

తపన పడి, అరే అరే తపన పడి
తపన పడి, తపన పడి తరించెనే సమయం
సడిలేని సాధనలోనే స్వరమేదో సాగించెనే సమరం
వడివడిగా మధనుడిగా వరించుకో తరించిపో నీదే ఈ మధనం.

" ధన్యవాదాలు "


రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending