నా పిచ్చి
నాతో నేను మాట్లాడుకుంటుంటే, నాకు పిచ్చి పట్టిందని కొందరు నాకేదో అయ్యిందని ఇంకొందరు అర్థం కానట్టు చూసేవారు. నాకు నేను చెప్పుకునే ప్రతి మాట నీతో పంచుకునే నా భావాలని వారికి తెలియదు. నా ఊహల్లో, నా ఆలోచనల్లో, నా అనువణువులో నిండిన నీతో మాట్లాడుతున్నానని వారికి తెలియదు. అంతులేని ఆశలతో, అంతుచిక్కని దారులలో, నీతో నేను చేస్తున్న ఈ ప్రయాణం నా జీవిత గమ్యానికి మూలం. అలుపు అన్న పదం మరిచిపోయి, ఆనందం కోసం వెంటపడే అల్లరి గాలులు తరుముతుంటే అసూయగా చూసే కళ్ళని తప్పించుకుని అందమైన ఆశల తీరం వైపు నడుస్తూ నీతో నేను చెప్పే ప్రతి మాట నాకో మధుర జ్ఞాపకం. ప్రపంచాన్ని మరిచిపోయేలా పదాలతో అల్లిన ప్రేమని పదే పదే తలుచుకుని పిలుచుకునేలా నీ పేరుని పలకడం నాకు ఇష్టం. నాకు అన్నీ నువ్వే, నీ గురించి చెప్పాలన్నా నాకు ఉన్నది నువ్వే. అందుకే అర్థంలేని మాటలతో విసిగిపోయిన ప్రతిసారి, నా మనసుని మార్చే నీ మాటల కోసం ఈ ప్రపంచానికి దూరంగా మన ప్రేమగా దగ్గరగా ఉండిపోతున్నాను.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment