నా సమయం

జనించవా సరికొత్తగ సమయం
చలించవా నువ్వు రేపటి ఉదయం
నిశీధివై, నిదురించని ఉషోదమై
మా కలల్ని, కథల్ని స్పృశించిపోవా...

వరించవా మొదలయ్యను పయనం
ధ్వనించవా నలు దిక్కుల విజయం
నిజానివై, నడిపించిన పదానివై
మా ఆశల్ని, శ్వాసల్లో నింపేసినావా...

" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending