నా కోసం ఒకరు

అవసరం ఎదురైన ప్రతిసారి అది తీర్చే వ్యక్తి మారితే తప్పు లేదు. కానీ, వారితో మన ప్రవర్తన మారకపోతేనే తప్పు. సొంతం అనుకున్నవారితో ఉండటంలో ఉన్న ప్రత్యేకత, పరిచయం అయిన ప్రతి ఒక్కరితో ఉంటే అది నీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. మనది కాని చోట తప్పు జరిగితే నేర్చుకుంటాం, అదే మనదైన చోట తప్పు జరిగితే సర్దుకుంటాం.

నాకు నేను, నీకు నువ్వు అని ఆలోచించడం చాలా తేలిక అయినా అలా బ్రతకడం కష్టం. నీకోసం నేను, నాకోసం నువ్వు అని ఆలోచించడం కష్టమే కానీ బ్రతకడంలో ఒక సంతోషం ఉంటుంది. నాకోసం ఒకరున్నారనే ఆలోచన జీవితానికి కావలసిన నమ్మకాన్ని, రేపటి కలల్ని నిజం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇష్టమైన చోట జీవితం మొదలవుతుంది, కష్టమైన చోట మార్పు మొదలవుతుంది. " ఇదే ఈ ప్రపంచానికి ముఖ్యం. "


" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments